Rajiv Gandhi Civils Abhayahastham beneficiaries clears Civils Mains from Telangana

తెలంగాణ నుంచి UPSC సివిల్ సర్వీసెస్‌ మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేశారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం కింద ప్రజా ప్రభుత్వం లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన వారిలో 20 మంది అభ్యర్థులు ఎంపిక కావడం పట్ల ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలిపారు.

సింగరేణి సంస్థ సహకారంతో ప్రభుత్వం తెలంగాణ నుంచి ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులై మెయిన్స్‌కు అర్హ‌త సాధించిన వారిలో అర్హులైన 135 మందికి గత ఆగస్టు నెలలో రాజీవ్ సివిల్స్ అభయ హస్తం కింద ప్రోత్సాహకంగా ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. వారిలో 20 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకి అర్హత సాధించారు.

తెలంగాణ నుంచి ఎక్కువ మంది సివిల్స్ సాధించేలా తదుపరి దశల్లోనూ అభ్యర్థులు రాణించాలని కోరుతూ ముఖ్యమంత్రి గారు శుభాభినందనలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here