వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పులివెందుల పట్టణంలో తన క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన ప్రజాదర్బార్ కు జనాలు పోటు ఎత్తారు.ఉమ్మడి కడప జిల్లాతో పాటు,ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ కార్యకర్తలు,నేతలు జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి భారులు తీరారు.
ఓటమి తరవాత ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు,అభిమానులు,నేతలు తరలి రావడంతో వైసీపీలో నూతన ఉత్తేజం వచ్చింది.జగన్ మోహన్ రెడ్డి నేను అండగా ఉంటాను, కష్టపడదాం,మళ్ళీ అధికారంలోకి వస్తాం అంటూ నాయకులకు,కార్యకర్తలకు హితబోధ చేస్తూ,పార్టీని బలోపితం చేసే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు.
జగన్ మోహన్ రెడ్డిని కలిసిన కార్యకర్తలలో టిడిపి కూటమితో ఇబ్బంది పడిన వారికి,దాడికి గురి అయిన వారికి భరోసా నింపుతూ ఇబ్బంది పెట్టిన అధికారుల పేర్లు వ్రాసుకొని ఉండండి అంటూ మానసిక దైర్యం నింపుతూ ఉన్నారు.
మళ్ళీ నేను సిఎం అయితే మీరు సీఎం అయినట్టే..ఇబ్బంది పెట్టిన అధికారులు మీ దగ్గరి పంపించి సెల్యూట్ కొట్టిస్త… పోలీసు అధికారుల పేర్లు వ్రాసుకొని రండి అంటూ బహిరంగంగా కార్యకర్తలకు దైర్యం నూరి పోస్తున్నారు.ఈసారి అధికారంలోకి వస్తే కొత్త జగన్ మోహన్ రెడ్డిని చూస్తారు అంటూ కార్యకర్తలలో ఉత్యాహం నింపుతూ ఉన్నారు.
- గతంలో లోకేష్ ” రెడ్ బుక్”
- ఇప్పుడు జగన్ “గుడ్ బుక్”
జగన్ తన కార్యకర్తలను పట్టాలు ఎక్కించడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకొని జిల్లాల పర్యటన మొదలు పెట్టి తనకు అచ్చిఓచ్చిన జనంతో మమేకం అవుతూ కార్యకర్తల సమావేశానికి ప్రణాళిక సిద్దం చేశాడు. కార్యకర్తలలో, నాయకులలో ఎమోషన్ నింపడం జగన్ మొదలు పెట్టారు.జగన్ మోహన్ రెడ్డి కార్యకర్తలతో మాట్లాడితే మళ్ళీ బట్టలు చించుకొని పని చేస్తారు.అందులో సందేహం లేదు.