హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ కంపెనీ సిద్ధిపేట జిల్లా బండతిమ్మాపూర్‌లోని ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్‌లో కొత్తగా నిర్మించిన (Hindustan Coca Cola Beverages Avinya) గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తో కలిసి ప్లాంట్‌కు ప్రారంభోత్సవం చేశారు.
తర్వాత ప్లాంట్ ప్రొడక్షన్ విభాగాన్ని సందర్శించి బటన్ నొక్కి ఉత్పత్తిని ప్రారంభించడంతో పాటు ప్లాంట్‌లో కోకా-కోలా ఉత్పత్తి విధానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో TGIIC చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, HCCB సీఈవో జాన్ పావ్లో రోడ్రిగేతో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.